మెట్ పల్లి మాజీ జెడ్పిటిసి రాధ – శ్రీనివాస్ రెడ్డిల కుమారుడు శ్రీకర్ వినాయక చవితి రోజు వాగులో పడి గల్లంతవగా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఒకపక్క శ్రీకర్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నప్పటికీ ఎగువ ప్రాంతంలో కురిసిన వరదనీరు ప్రవాహం తగ్గకపోవడంతో గాలింపునకు కొంత ఇబ్బందిగా మారిందని తెలుస్తుంది. నాలుగు రోజులు గడుస్తున్న తమ కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. శ్రీకర్ కుటుంబ సభ్యులను ఈ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించి ఓదార్చినప్పటికీ కుటుంబ సభ్యుల రోధిస్తున్న తీ