కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం హనుమాన్ గుత్తి గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా హనుమనుగుత్తి గ్రామానికి చెందిన పలువురు దివ్యాంగులు కూటమి ప్రభుత్వం చేపట్టిన పింఛన్లు కోతలో బాగంగా అర్హత ఉండి కూడా తమకు పెన్షన్ పోయిందని దాని వివరాలు మూలే సుధీర్ రెడ్డికి వివరించారు.అనంతరం ఆయన గ్రామంలోని రమేష్ తండ్రి ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వివరాలు ఆడిగి తెలుసుకుని వారికి పలు సూచనలిచ్చారు.