కలికిరి మండలం కలికిరి మేజర్ పంచాయతీలో అనుమతులు లేని మూడంతస్తులు ఆపై నిర్మించిన బహుల అంతస్తుల భవనాలకు నోటీసులు జారీ చేయాలని సచివాలయ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి,ఈఓ జి.అశోక్ తెలియజేశారు. శనివారం మధ్యాహ్నం కలికిరి మేజర్ గ్రామపంచాయతీలో పై అధికారుల ఆదేశాల మేరకు సిబ్బందితో సమావేశం నిర్వహించారు.కలికిరి పంచాయతీలో రెండంతస్తుల భవనాలకు మాత్రమే పర్మిషన్లు తీసుకొని బహుళ అంతస్తులు నిర్మించిన వారికి నోటీసులు జారీ చేయాలని తెలిపారు. రెండు అంతస్థులకు మించి బహుళ అంతస్తులు నిర్మించాలంటే నిర్మాణదారులు తప్పకుండా చుడా పర్మిషన్ తెచ్చుకోవాలన్నారు