కూటమి ప్రభుత్వం లో అమలు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలైన స్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతం అయిన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.పుట్టపర్తి డీఆర్ డిఏ వెలుగు ఆధ్వర్యంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలసి ఎంఎల్ఏ సింధూర ర్యాలీలో పాల్గొన్నారు. 900 మంది మహిళలతో కలసి పుట్టపర్తి తహసిల్దార్ కార్యాలయం నుంచి అన్న క్యాంటీన్ ,గణేష్ సర్కిల్ మీదుగా అబ్దుల్ కలాం షాదిమహల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.