అనంతపురం నగరంలోని ఐటిఐ మిట్ట వద్ద రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దీంతో రైల్వే ఎస్సై వెంకటేష్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు 55 నుంచి 60 సంవత్సరాల లోపు ఉంటాడని తెలిపారు. అతను వాకింగ్ స్టిక్ సహాయంతో నడుస్తున్నట్లుగా వారు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించడం జరిగిందన్నారు. మృతుడిని గుర్తుపడితే 9441445354 నెంబర్ కు సంప్రదించాలన్నారు.