అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో అరకు పాడేరు నియోజకవర్గాల వైయస్సార్ పార్టీ నేతలు రైతుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఏవో అప్పలస్వామికి వినపత్రాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పూర్తిగా నట్టేట ముంచిందని వారికి వైయస్సార్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని వారు వెల్లడించారు.