రాజానగరం జాతీయ రహదారిపై స్థానిక నరేంద్రపురం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళలను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆదివారం వివరాలు వెల్లడించారు. మృతురాలు రాజమండ్రికి చెందిన లత గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై రాజనగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.