దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వలన తమకు ప్రాణహాని ఉందని పినకడిమి గ్రామ సర్పంచ్ సునీత, ఆమె భర్త పలగాని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సాయంత్రం 6గంటలకు వారు మీడియాతో మాట్లాడారు. తన పొలాన్ని ఆక్రమించుకోవడానికి చింతమనేని పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. తన పొలాన్ని నాశనం చేసి చింతమనేని, గన్ మెన్, అతని అనుచరుడు రవి తనపై, తన భార్యపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. పోలీసులు, అధికారులు రక్షించాలని కోరారు..