యాదాద్రి భువనగిరి జిల్లా: సరదాగా సంతోషంగా గడపాల్సిన వినాయకుని చవితి పండుగ వేల పట్టణంలో బుధవారం విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన పోతగల్ల సతీష్(32) పట్టణంలోని ఓ గణేష్ మండపం వద్ద పనిచేసేందుకు వెళ్ళాడు.. ఈ క్రమంలో మండపం పైకి ఎక్కి తాపిలిన్ కవర్ కప్పుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి సిసి రోడ్డు దిమ్మపై పడ్డాడు. తల పగిలి తీవ్రంగా గాయాల పాలయ్యాడు వెంటనే స్థానికులు అపరమతమై అంబులెన్స్ లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.