ప్రమాదానికి కారణమైన సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నవభారత్ నిర్మాణ్ యువసేన ఆధ్వర్యంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ.. పరిశ్రమ యాజమాన్యంపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం సరి కాదని చెప్పారు. పరిశ్రమల్లో భద్రతపై సమీక్షించాలని కోరారు.