ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామంలో గండిచేరుకు లీక్ అవుతుంది. గ్రామస్తులు చెరువుకు మరమ్మతులు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇసుక సంచులను తీసుకొచ్చి నీరు పోతున్న ప్రాంతాలలో అడ్డుగా వేశారు. ఐదు సంవత్సరాల వ్యవధిలో ఎప్పుడు నిండని చెరువు ప్రస్తుతం నిండింది. ఈ క్రమంలో రైతుల ఆనందం వ్యక్తం చేసిన కొన్ని రోజులకే చెరువు గండిపడి నీరు వృధాగా పోయింది. ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువుకు మరమ్మతులు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.