పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద బారులు బుధవారం తీరారు. ప్రత్యేక షోలు, ఫస్ట్ డే ఫస్ట్ షో కోసంఅభిమానులు కిలోమీటర్ల దూరం నుంచే తరలి వచ్చారు. థియేటర్ల బయట బాణసంచా పేల్చి, పాలు చల్లుతూ, కేకలు వేస్తూ అభిమానులు పండగలా మార్చేశారు.