జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం (సరస్వతి) బ్యారేజీలో బోటు బోల్తా పడి ఒకరు గల్లంతయ్యారు... మహారాష్ట్ర శిరోంచ తాలూకాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంచిర్యాల జిల్లా పొక్కుర్ గ్రామం నుంచి చేపలు పట్టే పడవ కొనుగోలు చేశారు. గోదావరి నది ద్వారా మహారాష్ట్రకు వెళ్తున్న సమయంలో అన్నారం బ్యారేజీ గేట్లు తగిలి పడవ మునిగినట్లు సమాచారం. ఇందులో ఒకరు గల్లంత కాగా మరొకరు బయట పడినట్లు తెలుస్తోంది.