మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ,బాలికల జూనియర్ కాలేజ్, మండల ప్రజా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.వసతి గృహం పాఠశాల ఆవరణలోని కిచెన్ షెడ్ ,డైనింగ్ హాల్, తరగతి గదులు ,టాయిలెట్స్ పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు. విద్యార్థులకు డైట్ ప్రకారం ఆహారాన్ని అందించాలని షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.