కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బుధవారం సుమారు ఆసుపత్రి కాంపౌండ్ గోడకు ఆనుకొని ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ వద్ద అతడు మృతి చెంది కనిపించాడు.మృతుడు వయస్సు సుమారు 50–55 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. చామనచాయ వర్ణంలో మాసిన గడ్డం కలిగిన ఈ వ్యక్తి ముదురు నీలం రంగు టీ-షర్ట్, అదే రంగు నిక్కర్ ధరించి ఉన్నట్లు గుర్తించారు.ఇతని ఆచూకీ తెలిసిన వారు కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ శేషయ్య (ఫోన్: 9121101061, ల్యాండ్ లైన్: 08518-277187) కి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.