కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం వేపరాలకి చెందిన ఓ యువకుడు శనివారం పెన్నా నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడని స్థానికులు తెలిపారు. విషయం తెల్సిన వెంటనే యువకుడి కోసం మైలవరం ఎస్ఐ శ్యామ్ సుందర రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు శాఖ విజ్ఞప్తి మేరకు పెన్నా నదికి విడుదల చేస్తున్న నీటిని మైలవరం జలాశయ అధికారులు తాత్కాలికంగా ఆపివేశారు. గల్లంతైన యువకుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.