గుంటూరు పట్టణానికి చెందిన కటికం భారతి అనే మహిళ సోమవారం ఉదయం మంగళగిరి పట్టణంలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి వచ్చినట్లు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కె. వీరాస్వామి సోమవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎయిమ్స్ హాస్పిటల్ కి వచ్చిన మహిళ మంగళగిరి కొత్త బస్టాండ్ వద్ద ఆమె పరుసు పోగొట్టుకున్నట్టు చెప్పారు. వెంటనే మంగళగిరి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొంత సమయానికి ఓ బాలుడు తనకు పరుసు దొరికిందని మంగళగిరి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి పరుసు అప్పగించినట్లు వెల్లడించారు. వెంటనే సదరు బాధిత మహిళకు దొరికిన పరుసును అప్పగించినట్లు తెలిపారు.