ములుగు జిల్లాలోని మాల విద్యార్థులు, యువకులు, మాల మహానాడు సంఘాలు సెప్టెంబర్ 8న నిర్వహించబోయే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి తరలిరావాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు చిట్టి మల్ల సమ్మయ్య నేడు శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల మధ్య అగాధాలు సృష్టించి దళితులకు తీరని అన్యాయం చేశారని, జీవో నెం. 99 తీసుకువచ్చి మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు.