అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో తరచూ జరుగుతున్న గ్యాస్ సిలిండర్ల చోరీకి సంబంధించి పోలీసులు ఒకరిని పట్టుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన నాగరాజు అనే వ్యక్తి శుక్రవారం సిలిండరు పొదల్లో దాచిపెడుతుండగా స్థానికులు చూసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.