ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఆద్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలో నాకాబందీ నిర్వహించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్, అదిలాబాద్ ఎక్స్ రోడ్డు, ఫారెస్ట్ చెక్ పోస్ట్ ప్రాంతంలో పోలీసులు నాకబంది చేపట్టారు. ఆర్టీసీ బస్సు,కారు,ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 10 వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.