పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామంలో విషాదం నెలకొంది. చేపల వేటకు ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన మేకల రవి అనే వ్యక్తి, గ్రామ శివారులో ఉన్న వాగులోకి చేపలను పట్టేందుకు వెళ్ళాడు. చేపలను పట్టడం కోసం అమర్చిన విద్యుత్ తీగ, ప్రమాదవశాత్తు అతనికే తగలడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటి పెద్ద మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.