పాలకాయతిప్ప వద్ద అల్ల కల్లోలంగా సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా స్తానిక కోడూరు మండలం పాలకాయతిప్ప తీరంలో శుక్రవారం మద్యాహ్నం 3 గంటల సమయం వరకు సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు ఎనిమిది మీటర్ల ఎత్తున అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీని ప్రభావంతో సముద్రం వెయ్యి మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చింది. అధికారులు మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా, మెరైన్, అటవీశాఖ అధికారులు గేట్లను మూసివేసి ప్రజలను లోపలికి వెళ్లకుండా నిరోధించారు.