చిన్న బండారలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి పట్ల గ్రామస్థులు కుల వివక్షను చూపుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించి ఇక్కడ చోటు చేసుకున్న విషయంపై విచారణ జరిపినట్లు తెలిపారు. పరిస్థితిని ఎమ్మార్వో కవిత, సీఐ సత్యనారాయణ దృష్టికి తీసుకొని వెళ్లినట్లు చెప్పారు.