తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామంలోని శ్రీపోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం సాయంత్రం 4గంటలకు పాల్గొన్నారు. ఈమేరకు శ్రీపోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. తొలుత ఎమ్మెల్యే చింతమనేనికి ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీపోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలలో పాల్గొనడం అనందంగా ఉందని ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు.