మొవ్వ మండలం కోసూరులోని నాలుగు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన శ్రీరాములు అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇతను మచిలీపట్నానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. ఆలయాల తాళాలు పగులగొట్టి వెండి కిరీటాలు, బంగారు ఆభరణాలు, హుండీ డబ్బులను శ్రీరాములు దొంగిలించాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అతన్ని నిడుమోలులో పట్టుకున్నారు. దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.