ముస్లిం యువత రక్తదానం చేయడం అభినందనీయమని కామారెడ్డి పట్టణంలో ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అన్నారు.మిలాద్ ఉబ్ నబి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు 103 యూనిట్ల రక్తం సేకరించినట్లు పేర్కొన్నారు ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించడం కోసం రక్తదానం చేయడం సంతోషమని అన్నారు. ఇప్పటివరకు మర్కాజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో 650 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు.