కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ప్రతి రోజు ఏదోఒక ప్రమాదం జరుగుతుంది. మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో సివిల్ హాస్పిటల్ వైపు నుండి రాంనగర్ వైపు డ్యూటీ వెళ్తున్న ఓ వ్యక్తి బైక్ ను ముగ్గురు యువకులు జాగ్రత్తగా అతివేగంగా వచ్చి ఢీకొట్టారు. దీంతో బైక్ పై వస్తున్న సలీం వ్యక్తి గాలిలోకి ఎగిరి కింద పడి పోగా గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం లో బైక్ పై నుంచి కింద పడిపోయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ముగ్గురు యువకులు అక్కడి నుండి పారిపోయారు.