వినాయక నవరత్రోత్సవాల సందర్భంగా 8వ రోజున బుధవారం ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని, మండపంలోని గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరత్రోత్సవాల సందర్భంగా చేపట్టిన లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసి, అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వైశ్య సంఘ అధ్యక్షులు వుటురి నవీన్, ప్రధాన కార్యదర్శి బొడ్ల జగదీష్....