విశాఖలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ యువకుడిపై రైటర్ బాలు భాస్కర్ దాడి చేశారని ఆరోపిస్తూ, స్థానికులు, యువకులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.