తీన్ మార్ స్టెప్పులతో అలరించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్థానిక బుధవార్ పేట్ లో నంబర్ వన్ గణేశుని వద్ద బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. శోభాయాత్రలో ఎమ్మెల్యే తీన్మార్ స్టెప్పులతో అలరించారు. కార్యకర్తల కోరిక మేరకు బీజేపీ నాయకులతో కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేసారు. గణేష్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులను కోరారు.