తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయు) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. CITU జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ.. వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం రూ.20 వేల వేతనం, బీమా సౌకర్యం కల్పించాలన్నారు.