ఆసిఫాబాద్ జిల్లాలోని వసతి గృహాల్లో మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించకపోవడంతోనే విదార్థులు అనారోగ్యానికి గురై చనిపోతున్నారని BRSV జిల్లా కన్వీనర్ రాజ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరంలో వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి చనిపోగా, ఈ సంవత్సరం పంగాడి మదర పాఠశాల విద్యార్థి చనిపోయిందన్నారు. దీంతో జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.