నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలోని అభివృద్ధి పనులకు ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పుడు చదువు పక్కన పెట్టి పేదల కోసం పోరాడటానికి పదవ తరగతి మెమోను చింపేశానని అన్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక గ్రాడ్యుయేట్ ఓటు వేయడానికి డిగ్రీ లేకపోవడంతో అవమానపడ్డానని తెలిపారు. ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ పీజీ పూర్తి చేశానని, విద్యార్థులు చదువులు ఎప్పుడు విస్మరించవద్దని అన్నారు.