తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ పేర్కొన్నారు..శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కీ. శే . గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో వారి చిత్రపటానికి డిఆర్వో వెంకట నారాయణమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు 1863వ సంవత్సరం ఆగస్టు 29వ తేదిన శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం జరిగిందని, తెలుగు భాషకు చేసిన సేవలకు గుర్తుగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. గిడుగు రామ్మూర్తి గారు "వ్యవహారిక తెలుగు"కు నాంది పలి