పెడన మున్సిపల్ సమావేశంలో మట్టా పావని, మహమ్మద్ ఖజా మద్య వాగ్వాదం స్తానిక పెడన మున్సిపల్ సమావేశంలో వాటర్ ట్యాంకర్ల చలానాలపై శనివారం మద్యాహ్నం 3 గంటల సమయంలో జనసేన కౌన్సిలర్ మట్టా పావని అధికారులను ప్రశ్నించారు. ఆగస్టు నెలలో ఎన్ని చలానాలు కట్టారని ఆమె వివరణ కోరగా, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మహమ్మద్ ఖజా స్పందిస్తూ..మీ కూటమి ఎమ్మెల్యే పీఏ ఫోన్ కాల్ మేరకే ట్యాంకర్లు వెళ్తున్నాయి, మీరు అక్కడ ప్రశ్నించండి 'అంటూ సమాధానమిచ్చారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.