ఆదోని తహశీల్దార్ రమేశ్పై సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వేటు వేశారు. వరద సమయంలో ఎవరూ సెలవుపై వెళ్లొద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ రమేశ్ అనుమతి లేకుండా సెలవులో వెళ్లారు. భారీ వర్షాలతో ఆదోనిలో పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో టెలీకాన్ఫరెన్స్కు సైతం ఆయన హాజరుకాలేదు. దీంతో రమేశ్ను కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. డిప్యూటీ తహశీల్దార్ బాబును ఇన్ఛార్జి తహశీల్దార్గా నియమించారు.