రాయచోటి: జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం హెచ్ఐవి అవగాహన క్విజ్ పోటీలు రాయచోటి లో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య, ఇంటర్మీడియట్ మరియు ప్రోగ్రాం మేనేజర్ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులలో హెచ్ఐవి, సుఖవ్యాధుల (STI) పై అవగాహన పెంపొందించడం, సురక్షిత పద్ధతులు పాటించడం మరియు వివక్షను తగ్గించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా ఈ పోటీల ద్వారా విద్యార్థులు తమ సమాజంలో అవగాహన వ్యాప్తి చేయగలుగుతారని అన్నారు.