మండపేట, ఏడిద రోడ్డు లో కొలువైవున్న పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద శ్రావణ మాసం 5వ శుక్రవారం పర్వదినం పురస్కరించుకుని అమ్మవారికి సారె సమర్పించారు. విశేష పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో ముడుపులు కట్టి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణంలో మండపేట కు చెందిన "రెడ్డి పద్మ భజన బృందం" "అవధూత భజన బృందం" సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి.