కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట సోమవారం దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు,బద్వేల్ సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు మాట్లాడుతూ శ్రీ శక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పించడం మాకు ఏమి అభ్యంతరం లేదన్నారు. అయితే దివ్యాంగులమైన మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు.దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేందుకు గుర్తుగా ఉచిత బస్సు పాసులు మంజూరు చేయాలన్నారు.