కీసర మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. కాలేశ్వరం పై కాంగ్రెస్ సర్కాలు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని నినాదాలు చేశారు. రైతులకు నీళ్లు ఇచ్చిన కెసిఆర్ పై కేసులు వేస్తున్నారని ఆరోపించారు. కాలేశ్వరం కుట్రతో పాటు సిబిఐ డ్రామా అంటూ మండిపడ్డారు.