తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెంలో వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా తెలిపారు. తూపిలిపాలెం లో అయన మీడియాతో మాట్లాడారు. వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు తూపిలిపాలెం సముద్రం వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఆహ్లాదకరమైనవాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరిగేలా వారి సిబ్బంది ద్వారా కట్టుదిట్టమైనఏర్పాట్లు చేశారన్నారు. తుపిలి పాలెం నిమజ్జనం ప్రాంతాన్ని నాయుడుపేట డిఎస్పి చెంచు బాబు పరిశీలించారు