నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసులు గంజాయి విక్రయితలపై ఉక్కు పాదం మోపారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణ శివారులోని తాటికల్లు రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1 .290 కిలోల గంజాయి ఏడు సెల్ ఫోన్లు ఒక స్కూటీ ఒక మోటార్ సైకిల్ ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముఠాను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.