విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారు సోమవారం దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాధుర్ ని చిన్న వాల్తేరు వద్ద ఉన్న రైల్వే గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ భరత్ గారు విశాఖపట్నం రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, ఆధునిక సదుపాయాల విస్తరణతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీపై పూర్తి వివరంగా చర్చించారు.ఎంపీ భరత్ గారు మాట్లాడుతూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలి అని విశాఖకు జాతీయ స్థాయిలో ప్రత్యేక తీసుకో రావాలని తెలిపారు.