మహిళలపై వేధింపులు, హింసలు తగ్గాలంటే కేవలం చట్టాలు, హెచ్చరికలు సరిపోవని అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమని ఏపీ మహిళా కన్వెన్షన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను బాధ్యతలు చేపట్టిన మూడు నెలల నుంచి ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.