హయత్ నగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్ సంక్షేమ సంఘం భవనం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ రిక్షాలను కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెత్త సేకరణ రిత్యాలు పనిచేయాలని తెలిపారు. స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కార్పొరేటర్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఎలాంటి సమస్యలున్న తమకు తెలియజేయాలని తెలిపారు.