మారుతున్న కాలానుగుణంగా విద్యార్థిని, విద్యార్థులు చదువుతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలని అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలచంద్ర అన్నారు. శనివారం పట్టణంలోని ధరణి టౌన్షిప్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు రహదారి నిబంధనలు, సమాజంలో జరుగుతున్న మార్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కల్పించారు. ఆటోల్లో ప్రయాణం చేసేటప్పుడు, బయటి వ్యక్తులతో ఎలా మసలుకోవాలనే అంశాలను వివరించారు.