జిల్లాలోని తాంసి మండల కేంద్రంలో చారిత్రాత్మిక ఘట్టం ఆవిస్కృతమైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో అధికారికంగా పోలాల పండగ వేడుకల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథులుగా హాజరుకగా, ప్రొఫెసర్ తిరుమల్ రావ్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఆద్వర్యంలో శనివారం అధికారికంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిధులను గ్రామస్తులు సంప్రదాయ మేళతాళాలతో, ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి పండుగకు శుభారంభం చేశారు.