వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రాంతాలలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని వేంపల్లి సీఐ నరసింహులు పేర్కొన్నారు. పట్టణంలో ప్రశాంత వాతావరణం లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవడం, నిబంధనల ప్రకారం నడుచుకుంటూ విగ్రహాలను నిమజ్జనం చేయడం వంటి కార్యక్రమాలపై పోలీసులు నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. వేంపల్లి సమీపంలోని నంది పల్లె చెరువు వద్ద పోలీసుల పహారాలో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా శనివారం జరిగింది. సిఐ పోలీస్ సిబ్బందితో కలిసి నిమజ్జనం ప్రదేశంలో నదిలోకి ఎవరూ దిగకుండా జాగ్రత్తలు పడ్డారు.