కర్నాటకలోని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం మండలం చదం గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు చదం గ్రామానికి చెందిన రామకృష్ణ కుమారుడు సందీప్ బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నైట్ డ్యూటీ ముగించుకుని సోమవారం తెల్లవారుజామున బైక్ పై మరో యువకుడితో కలసి రూముకు వెళుతుండగా కెఎస్ ఆర్టీసి బస్సు డీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరు వెళ్లారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.