కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి వద్ద గల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల వరద నీటిలో మునిగిపోయింది.పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు.. స్థానికులు జిల్లా అధికారులకి సమాచారం అందజేశారు రిస్క్ టీం విద్యార్థులని కాపాడారు.. భుజాలపై ఎత్తుకొని వారిని కాపాడారు.సుమారు పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం వారిని మున్నూరు కాపు సంఘ భవనానికి తరలించారు.